ప్రచురణ తేదీ : Apr 5, 2018 9:46 AM IST

సల్మాన్ జింకల వేట కేసు తేలేది ఈ రోజే!

గత 20 ఏళ్ల క్రితం నుంచి సల్మాన్ ఖాన్ జింకలను వేటాడిన కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ న్యాయస్థానం ఎన్ని సార్లు విచారణ చేపట్టినప్పటికీ ఫైనల్ తీర్పు రాలేదు. సల్మాన్ కోర్టుకు వెళ్లడం రావడం జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1999 లో జోధ్ పూర్ లో షూటింగ్ నిర్వహిస్తుండగా సల్మాన్ విహారయాత్ర అంటూ జింకలను వేటాడిన సంగతి తెలిసిందే. హమ్ సాథ్ సాథ్ హైన్ సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. వారితో పాటు సైఫ్ అలీ ఖాన్ – టబు – నీలిమ్ – సోనాలి బింద్రే కూడా ఘటన జరిగినప్పుడు ఉన్నారు. ఇకపోతే కేసు నమోదవ్వగానే అప్పట్లో సల్మాన్ వారం రోజులు జోధ్ పుర్ లో జైలు జీవితాన్ని గడిపాడు. ఆ తరువాత కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గా.. అంటే మార్చ్ 28న కేసుకు సంబందించిన వాదనలు పూర్తయ్యాయి. ముందుగానే కేసులో ఉన్న నటి నటులు జోధ్ పూర్ కి చేరుకున్నారు.

Comments