ప్రచురణ తేదీ : Sun, Oct 8th, 2017

ధోని గురించి సెహ్వాగ్ అంత మాట ఎలా అనేసాడు!

టీమ్ ఇండియా క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ అంటే కచ్చితంగా అందరు చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోని. అతను కెరియర్ లో సాధించిన విజయాలంటే కంటే మీద విమర్శలు చేసే వారు ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి టీం ఇండియాలో కుర్రాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాడని పేరున్న ధోనికి సీనియర్ ఆటగాళ్ళతో కాస్తా సంబంధాలు తక్కువగా ఉన్నాయి అనేది చాలా మంది మాట. ఫామ్ లేకున్న టీంలో కొనసాగే ఆటగాళ్ళు ఎ స్థాయిలో ఉన్న వారిని తప్పించడానికి ధోని వెనకడుగు వేయడని అంటూ ఉంటారు. ధోనిలో ఉన్న ఆ పద్ధతి సీనియర్ ల నుంచి విమర్శలు ఎదుర్కొనేలా చేసాయి.

తాజాగా మహేంద్ర సింగ్ ధోని మీద డాషింగ్ బాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ ఇప్పుడు అందరికి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసాయి. గంగూలీ లేకపోతే ధోని అనే ఆటగాడు ఈ రోజు ఉండేవాడు కాదనే విధంగా అతను వాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. దాదా తన బాటింగ్ ని త్యాగం చేసి ధోనిని బాటింగ్ ఆర్డర్ లో ముందు పంపించడం వలన అతను అంతగా సక్సెస్ అయ్యాడని సెహ్వాగ్ అన్నట్లు సమాచారం. ధోనికి దాదా ఇచ్చినన్ని అవకాశాలు ఎవరు ఇవ్వలేదని. అతని సక్సెస్ వెనుక కచ్చితంగా గంగూలీ భాగం చాలా ఉంటుందని అన్నారు. అయితే ధోనికి గంగూలి ఇచ్చినంత అవకాశం ద్రావిడ్ ఇవ్వలేదని. అయితే ధోని పించ్ హిట్టర్ గా మారడంలో మాత్రం ద్రావిడ్ పాత్ర ఉందని, అతను చివాట్లు పెట్టడం వలనే ధోని మంచి ఫినిషర్ గా మారాడని సెహ్వాగ్ అన్నట్లు సమాచారం. అయితే సెహ్వాగ్ ఇప్పుడు ధోని మీద ఉన్నపళంగా ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసాడు అనేది పెద్ద ప్రశ్న. గతంలో సెహ్వాగ్ సహచరుడు గంబీర్ కూడా చాలా సందర్భాల్లో ధోని మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితిలో సెహ్వాగ్ మాటలకి కాస్తా ప్రాధాన్యత పెరిగింది.

Comments