ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

మేము చేసిన పొరపాటు అదే.. కోహ్లీ కామెంట్స్

వన్డే సిరీస్ విజయంతో దూకుడు మీద ఉన్న టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా సెకండ్ టీ20 తో చెక్ పెట్టింది. ఏ పరిస్థితుల్లోనూ ఇండియాకు అవకాశం ఇవ్వకుండా ఆసీస్ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదటి టీ20 లో విజయం అందుకున్న కోహ్లీ సేన రెండవ టీ20 లోని విజయాన్ని అందుకొని ఈ సిరీస్ ను కూడా పొందాలని అనుకుంది. కానీ ఆసీస్ న్యూ పేస్ బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్ కేవలం 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో కోహ్లీ సేన కోలుకోలేని దెబ్బతో ఓటమిపాలైంది.

ఈ విషయం పై స్పందించిన కోహ్లీ ఓటమి కి గల కారణాలని తెలిపారు. బ్యాటింగ్ వైపల్యమే ఓటమికి కారణమని తెలుపుతూ.. పేస్ బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని తెలిపాడు. విజయావకాశాలు అనుకూలంగా లేనప్పుడు 120 శాతం కష్టపడాలి, బ్యాట్స్ మెన్ కొంచెం సెట్ అయ్యే వరకు క్రీజులో ఉండాల్సింది. కానీ ఆసీస్ జట్టు అద్భుతమైన ఆట తీరుతో విజయాన్ని అందుకుందని విరాట్ వివరించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడవ టీ20 ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.

Comments