ప్రచురణ తేదీ : Sat, Sep 9th, 2017

థ్రిల్లింగ్ వీడియో : క్రికెట్ లో మరో కొత్త షాట్.. కత్తి సాము లాగా బ్యాట్ ను


ప్రస్తుతం క్రికెట్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆటలో రూల్స్ అన్ని మారిపోయి కొత్త తరహాలో ప్లేయర్స్ కనబరుస్తున్న ప్రతిభ అంతా ఇంతా కాదు. ఫార్మాట్ ఏదైనా కొత్తరకం షాట్స్ తో అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తున్నారు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఎక్కువగా హెలికాఫ్టర్ షాట్ ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోని ఆ షాట్ ని కనిపెట్టి ఆటలో ఆ షాట్ పాపులార్ అయ్యేలా చేశాడు. ఇక అంతకుముందు భారత జట్టు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కనిపెట్టిన ఉపర్ కట్ తో ఉర్రుతలుగించారు.

ఆ షాట్ ని అప్పుడప్పుడు కొందరు ఆటగాళ్లు ట్రై చేస్తుంటారు. దిల్షాన్ దిల్ స్కూప్ అనే షాట్ తో శ్రీలంకలో అది చాలా ఫెమస్ అయ్యేట్లు చేశాడు. ఇక పీటర్సన్ డివిలియర్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు తమదైన శైలిలో బంతిని బౌండరీకి పంపిస్తూ.. క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే ఇప్పుడు మరో కొత్త షాట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది ఎప్పుడు ఆడారో ఎక్కడో ఆడారో తెలియదు గాని ఇంగ్లాండ్ కు చెందిన ఆటగాడు కొట్టిన షాట్ నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ షాట్ కి అభిమానులు ఓ పేరు కూడా పెట్టారు. హెలిస్కూప్‌ షాట్‌ అని ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. బంతి ఎదురుగా వచ్చినపుడు బ్యాట్ తో కత్తి సాము చేస్తున్నట్టు చేసి బంతి రాగానే అమాంతం పైకి లేపి బౌండరీకి పంపాడు. ప్రస్తుతం ఆ షాట్ యొక్క వీడియో నెటిజన్స్ ని తేగా ఆకర్షిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

Comments