ప్రచురణ తేదీ : Thu, Jan 5th, 2017

ధోని నిర్ణయం ఆయనకు సంతోషమా..?

yuvraj
ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మహిని కెప్టెన్గా మిస్సవుతున్నామంటూ ట్విట్టర్ లో, పేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో హోరెత్తించారు. ధోని లాంటి కెప్టెన్ లేడంటూ అభిమానులతో పాటు పలువురు సీనియర్ క్రికెటర్ లుకూడా ధోని సేవలను కొనియాడారు.అభిమానులంతా ఓ వైపు బాధపడుతున్నా ధోని నిర్ణయాన్ని గౌరవిచారు. కానీ కొంతమంది ధోని నిర్ణయం ఓ వ్యక్తికి సంతోషాన్ని కలిగించేదని పోస్ట్ లు ప్రారంభించారు.

ఆవ్యక్తి మరెవరో కాదు యువరాజ్ సింగ్ తండ్రి యోగ రాజ్ సింగ్ అని సోషల్ మీడియా లో పోస్ట్ లు ప్రారంభించాడు. ధోని నిర్ణయంతో సంతోషించిన మొట్టమొదటి వ్యక్తి యోగ్ రాజ్ సింగే అని సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. యువరాజ్ ని పలు సిరీస్ లకు ఎంపిక కాకుండా ధోని అడ్డుకున్నాడని యోగ్ రాజ్ బహిరంగంగానే పలు మార్లు ఆరోపించాడు.

Comments