ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

ఆరు బాల్స్ కి ఆరు వికెట్లు..అన్నీ బౌల్డులే..ఆ సూపర్ హీరో ఇతడే..!


ఆరుబంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టిన కొందరు ఆటగాళ్లు ఉన్నారు. వారిలో మొదట మనకు గుర్తుకు వచ్చేది మన యువరాజే. టి 20 ప్రపంచ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ విసిరిన వేగవంతమైన బంతులను యువి అవలోకగా సిక్సర్లు బాదేశాడు. అదే తరహాలో 13 ఏళ్ల కుర్రాడు ఓ రికార్డుని అందుకున్నాడు.కానీ అతడు సిక్స్ లు బడలేదు. ఆరుబంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టేసాడు. ఈ అరుదైన ఘనతని అండర్ 13 జట్టులో సభ్యుడైన 13 ఏళ్ల ల్యూక్ రాబిన్ సన్ అనే బుడతడు సాధించాడు.

ఫిలడెల్ఫీయ క్రికెట్ క్లబ్ తరుపున జట్టు సభ్యుడైన ల్యూక్ ఆరుబంతుల్లో ఆరుగురు బ్యాట్స్ మాన్ లను ఫెవిలియన్ పంపాడు. అదికూడా అన్ని బౌల్డు ల రూపంలోనే. అతడి ప్రదర్శనని స్వయంగా వీక్షించిన కుటుంబ సభ్యులు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇందులోనే పెద్ద విశేషం ఉంది. అతడి తల్లి దండ్రులు మ్యాచ్ ని ప్రేక్షకుల లాగా చూడలేదు. ల్యూక్ తండ్రి మైదానం లో అంపైర్ కాగా, అతడి తల్లి స్కోర్ బోర్డు వద్ద విధులు నిర్వహించే ఉద్యోగం చేస్తోంది. తమ కొడుకు అరుదైన ఘనత సాధించిన మ్యాచ్ లో తాము కూడా ఈవిధంగా పాలుపంచుకోడవతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Comments