ప్రచురణ తేదీ : Tue, Jan 30th, 2018

అలనాటి హీరోయిన్ పై బిజినెస్ మాన్ కామవాంచ..!

80 దశకంలో బాలీవుడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జీనత్ అమన్ లైంగిక వేధింపులకు గురయ్యారు. తనని ఓ బిజినెస్ మాన్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పోలీస్ లని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జీనత్ అమన్ ని వేధించిన వ్యాపారవేత్త ఆమె కుటుంబానికి సన్నిహితుడే.

అమర్ ఖన్నా మరియు జీనత్ అమన్ ల మధ్య గతంలో మంచి సంబంధాలు ఉండేవి. ఇటీవల వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ విడిపోయారని పోలీస్ ల ప్రాధమిక విచారణలో తేలింది. ఆ తరువాత జీనత్ అతడితో మాట్లాడడం మానేసింది. అమర్ మాత్రం జీనత్ వెంటపడడం ఆపకుండా ఆమెకు ఫోన్ కాల్స్ చేస్తూ, అసభ్యకరమైం పదజాలం ఉపయోగిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీస్ లు కేసు నమోదు చేసారు. ప్రస్తుతం అమర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జీనత్ అమన్ భర్త 1998 లో అనారోగ్య కారణంగా మరణించారు.

Comments