ప్రచురణ తేదీ : Sep 17, 2016 3:47 AM IST

చంద్రబాబు ఎన్నికలకు సిద్ధం కావాలంట..!

amabati-ram-babu
వైసిపి ఉంటె పుట్టగతులు ఉండవనే చంద్రబాబు ఈ రాష్ట్రానికి వైసిపి అవసరమా? అన్న వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు.శుక్రవారం హైదరాబాద్ వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తమ పార్టీ రాష్ట్రం లో ఉండడం అవసరమో లేదో తేలాలంటే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు కు సవాల్ విసిరారు. తాను ఇరుక్కున్న అన్ని కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని రాంబాబు విమర్శించారు. లక్షల కోట్లు వెనకేసుకోవాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు వ్యవహారం ఇలా తయారైందని అన్నారు. తాము రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాము రాష్టాభివృద్ధిని అడ్డుకోవడం లేదని అభివృద్ధి పేరుతో జరుగుతన్న అవినీతిని అడ్డుకుంటున్నట్లు తెలిపారు.

Comments