ప్రచురణ తేదీ : Jan 26, 2017 10:00 AM IST

వైజాగ్ లో ప్రదర్శనలను అడ్డుకుంటామంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ

vizag
జనవరి 26న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగు యువత చేపడుతున్న మౌన ప్రదర్శనలను అడ్డుకుని తీరుతామంటున్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆడారి కిషోర్ కుమార్. బుధవారం స్వర్ణభారతి స్టేడియం ఎదురుగా ఉన్న ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్లను వెంటనే ఆపాలని కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు.

గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకోవాల్సిన సమయంలో ప్రత్యేక హోదా కోసం నిరసనలను చేపట్టి దేశాన్ని అవమానిస్తారా…? అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను జైల్లో పెట్టినపుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని వారు ప్రశ్నించారు. విదేశీయులు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సమయంలో ఇలా చేయడం సరికాదన్నారు. విశాఖ సమ్మిట్ లో గత సంవత్సరం 4 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని, అందులో లక్షా 43 వేల కోట్ల ప్రాజెక్ట్ లు కార్యరూపం దాల్చాయన్నారు. ఈ నెల 27, 28న విశాఖలో రెండు రోజుల పాటు పెట్టుబడుల సదస్సులను నిర్వహిస్తుంటే ఉద్యమాల పేరుతో రాష్ట్రానికి అపఖ్యాతి తీసుకువస్తున్నారు. యువతను తప్పుదారి పట్టించి కేసుల్లో ఇరుకించి వారి భవిష్యత్తును నాశనం చేయొద్దన్నారు.

Comments