ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

ఖాకీ బట్టలు వేసుకోవాలనుకున్నాడు కానీ అంతలోనే మృత్యువు కౌగిలించుకుంది

man
ఖాకీ చొక్కా వేసుకోవాలనేది అతని కల. ఆ ప్రయత్నంలోనే తన కలను నిజం చేసుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకున్న విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని ఏలూరులో జరిగింది. ఎస్సై అవ్వాలనే కోరికతో ఉన్న ఆ యువకుడు ఒక్కసారి కాదు… రెండుసార్లు కాదు మూడుసార్లు ఎస్సై పరీక్షలలో పాల్గొన్నాడు ఆ యువకుడు. మూడోసారి ఏమైనా సరే తాను ఎస్సై అవ్వాలనే పట్టుదలతో పరుగు పరీక్షలో పాల్గొన్న అతడు పరుగెడుతూనే కుప్పకూలిపోయాడు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఎల్వీసి శేఖర్ విశ్వనాధం (26) ఎంబీఏ పూర్తి చేసి, గతంలో రెండుసార్లు ఎస్సై పరీక్షలకు హాజరయ్యి ఫెయిల్ కావడంతో తాజాగా మూడవసారి కూడా అప్లై చేసాడు. ఎలా అయినా ఎస్సై ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్న శేఖర్ చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఏలూరులో ఎస్సై ఉద్యోగానికి పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ 1600 మీటర్ల పరుగు పందెం పోటీలలో పాల్గొన్న శేఖర్ పందెం మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతనిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో విజయవాడకు తీసుకెళ్లాలని అక్కడి సూచించడంతో విజయవాడకు తరలిస్తుండగా శేఖర్ మృతి చెందాడు.

Comments