ప్రచురణ తేదీ : Sun, Oct 8th, 2017

లేడీస్ హాస్టల్ పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య!

ఈ మధ్య కాలంలో యువతరంలో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రేమ విఫలం అయ్యిందని, చదువుల్లో మార్కులు తక్కువ వచ్చాయని, ఉద్యోగం రాలేదని ఇలా కారణాలు చూపిస్తూ సూసైడ్ చేసుకుంటున్నారు. అలాగే శనివారం రాత్రి ఎస్.ఆర్.నగర్ పరిధిలో మధురా నగర్ కి చెందిన ఈశ్వర్ ఆనంద్ అనే యువకుడు రాజ్ దూత్ అపార్ట్ మెంట్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని యశోద హాస్పిటల్ కి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న అతను రాజ్ దూత్ అపార్ట్ మెంట్ కి ఎందుకు వెళ్ళాడు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ అపార్ట్ మెంట్ లో ఒక లేడీస్ హాస్టల్ ఉందని, ఆ హాస్టల్ కి ఏమైనా వచ్చాడా అనే విషయాలని కూడా పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Comments