ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

ఇంకనుండి దాని పేరు యాహూ కాదు ఆల్బబా

yahoo
ఈమెయిల్ అనగానే ఇప్పటి జనరేషన్ అందరికీ ‘జీమెయిల్’ గుర్తొస్తుంది. కానీ అసలు ఈమెయిల్ వచ్చిన కొత్తలో అందరికీ బాగా అలవాటైన పదం ‘యాహూ’. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ దీనినే ఎక్కువగా వాడేవారు. తరువాతి రోజుల్లో ‘జీమెయిల్’ వచ్చాక నెమ్మదిగా ‘యాహూ’ పై జనాలకు మక్కువ తగ్గింది. అయినా ఇప్పటికే ‘యాహూ’ చాలామంది వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘యాహూ’ పేరును మారుస్తున్నారంటూ ఒక వార్త బయటకొచ్చింది.

ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఇన్ కార్పొరేషన్ తన పేరును మార్చుకుంటుంది. ఈ సంస్థకు ఆల్బబా ఇన్ కార్పొరేషన్ అనే పేరును పెడుతున్నట్టు సోమవారం ప్రకటించింది. కొన్నిరోజుల క్రితం యాహూను 32 వేల కోట్ల భారీ మొత్తానికి యాహూను వెరిజోన్ కొనుగోలు చేసింది. అయితే రెండుసార్లు యాహూలో భారీ సమాచార చౌర్యం జరిగిందన్న వార్తల నేపథ్యంలో వెరిజోన్ ఈ డీల్ ను రద్దు చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వెరిజోన్ ఎక్సిక్యూటివ్ తాము యాహూను బలోపేతం చేయాలనుకుంటున్నామని, ప్రస్తుతం సమాచార చౌర్యంపై వస్తున్న వార్తలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ డీల్ అమలులోకి రాగానే ప్రస్తుతం ఉన్న సీఈఓ రాజీనామా చేస్తారని, ప్రస్తుతం ఉన్న బోర్డులో ఐదుగురు డైరెక్టర్లు రాజీనామా చేస్తారని అన్నారు.

Comments