ప్రచురణ తేదీ : Thu, Apr 26th, 2018

మహేష్ బాబు డైరెక్టర్ ప్రొడ్యుసర్ కానున్నాడా..?

సాధారణంగా రచయితలు దర్శకులుగా మారడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కువగా జరుగుతున్న కథనాలే. కానీ రచయిత దర్శకుడిగా మారి ఆ తర్వాత అదే దర్శకుడు నిర్మాతగా మారితే ఎలా ఉంటుంది. ఏంటీ మీరు కూడా ఆలోచనలో పడ్డారా..? అవును తాజాగా భరత్‌ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన రచయిత, దర్శకుడు కొరటాల శివకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
దర్శకుడిగా నాలుగు వరుస విజయాలు అందుకొని స్టార్‌ డైరెక్టర్ల లిస్ట్‌ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు కొరటాల శివ. అయితే కొరటాల త్వరలో నిర్మాతగా కూడా మారనున్నారట. అయితే నిర్మాణ సంస్థను ఎప్పుడు స్థాపించేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. చాలా కథలు నచ్చినా సమయం సరిపోని కారణంగా ఆ చిత్రాలను తాను డైరెక్ట్ చేయలేకపోతున్నానని, అందుకే నిర్మాతగా మారి యువ దర్శకులకు అవకాశాలివ్వాలని కొరటాల భావిస్తున్నారు. భరత్‌ అనే నేను తరువాత కొరటాల తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క అల్లు అర్జున్‌ తప్ప స్టార్ హీరోలెవరు ఖాలీగా లేకపోవటంతో బన్నీతోనే కొరటాల శివ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కొరటాల శివ నిర్మాణంలో రాబోయే సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు కొట్టాలని ఆశిద్దాం.

Comments