ప్రచురణ తేదీ : Oct 7, 2017 2:30 PM IST

భర్తను చెట్టుకు కట్టేసి..భార్యని దారుణంగా..

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారాలు జరగకుండా అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. రీసెంట్ గా జరిగిన ఘటన గురించి తెలుస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్‌ కు చెందిన ఇద్దరు దంపతులు వారి మూడేళ్ల చిన్నారిని హాస్పత్రిలో చూపించి బైక్ పై ఇంటికి వస్తుండగా.. మార్గం మధ్యలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. ముందుగా వారిని తుపాకులతో బెదిరించారు. భర్తని తీవ్రంగా కొట్టి మహిళ నుంచి చిన్నారిని లాక్కున్నారు. ఆ తర్వాత వారిని పక్కన ఉన్న అడవుల్లోకి లాక్కెళ్లారు.

భర్తను ఒక చెట్టుకు కట్టేసి అతని కళ్ల ముందే అత్యంత దారుణంగా మహిళపై అత్యచారం చేశారు. చివరికి వారిని బెదిరించి అక్కడ నుంచి పరారయ్యారు. అయితే గాయపడి ఉన్న వారిని అటుగా వస్తున్న రైతులు చూసి పోలీసులకు సమాచారాన్ని అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. యూపీలోని బులంద్‌షహార్‌లో కొన్ని నెలల క్రితం కారులో వెళుతున్న ఫ్యామిలీని అడ్డగించి తల్లి ,కూతుళ్లపై దారుణంగా అత్యచారం చేశారు. ఆ ఘటన మరవకముందే మళ్లీ మరొక ఘటన చోటు చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

Comments