ప్రచురణ తేదీ : Tue, Oct 13th, 2015

ఆమె మార్షల్ ఆర్ట్స్ కోచ్ అని తెలియక… అలా చేశారు..!

naveentha
సోమవారం రాత్రి నవనీత అనే మార్షల్ ఆర్ట్స్ కోచ్.. విధులు ముగించుకొని ఇంటికి తిరిగివెళ్తున్నది. అయితే, ఎల్బీనగర్ వద్ద కొందరు తాగుబోతులు ఆమెను అటకాయించారు. చీరపట్టుకొని లాగారు. అసభ్యపదజాలంతో.. మాట్లాడటం మొదలు పెట్టారు. వారి మాటలు, చేష్టలు హెచ్చుమీరడంతో.. ఆమెకు ఓపిక నశించి..కోపం నషాళానికి ఎక్కింది. అంతే.. తాగోబోతులిద్దర్ని చెడుగుడు ఆడుకున్నది. పిడిగుడ్డులతో రఫ్ ఆడించింది. అయితే, ఈ దృశ్యాన్ని చూసిన కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకొని ఆ తాగుబోతులకు నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తన జీవనానికే కాకుండా.. తనను తాను రక్షించుకోవడానికి కూడా ఉపయోగపడిందని నవనీత పేర్కొన్నది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Comments