ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

కూతురిని ప్రేమించిన అబ్బాయిని ఆ తండ్రి ఆలా చేశాడు…!

women
వారిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమ ఇష్టం లేని అమ్మాయి తండ్రి ఆ అబ్బాయిని రౌడీలతో కొట్టించాడు. అయినా వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకపోగా ఇంకా పెరిగింది. దీంతో కూతురికి వేరే సంబంధం చేయాలనుకున్నాడు తండ్రి. పెళ్లి ఇష్టం లేని ఆ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ తండ్రికి ఉన్న రాజకీయ పలుకుబడితో ఆమెను పోలీస్ స్టేషన్ నుండి నేరుగా ఇంటికి తీసుకుపోయాడు. గత మూడు రోజులుగా ఆ అబ్బాయి ఆచూకీ లేకపోవడంతో ఆ అమ్మాయి మళ్ళీ ఇంట్లోనుండి పారిపోయింది. ఇదంతా సినిమా స్టోరీ కాదు. మన వరంగల్ లో జరిగిన రియల్ స్టోరీ.

వరంగల్ లోని గాయత్రి సైన్స్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్ డైరెక్టర్ సుదిర శ్రీనివాస్ గుప్తా కుమార్తె శృతి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలోనే తన సహోద్యోగి అయిన అనుదీప్ వర్మ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అనుదీప్ కూడా వరంగల్ కు చెందినవాడే కావడం తో వారి స్నేహం త్వరలోనే ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన శృతి తండ్రి కూతురు మనసు మార్చడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఆరు నెలల క్రితం అనుదీప్ ను కొందరు వ్యక్తులతో దాడి చేయించి తీవ్రంగా కొట్టించాడు. అంతేకాకుండా కూతురిపై నిఘాను పెంచి, వేరొకరితో ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ వివాహం చేసుకోవడం ఇష్టంలేని శృతి ఇంటినుండి బయటకొచ్చి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు శ్రీనివాస్ గుప్తాను స్టేషన్ కు పిలిచి మాట్లాడారు. ఆయన తనకున్న రాజకీయ పలుకుబడితో కూతురిని పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులనుండి అనుదీప్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన శృతి మరొకసారి ఇంటినుండి పారిపోయి అనుదీప్ సోదరి నివాసముంటున్న కరీంనగర్ చేరుకుంది. ఆమె సాయంతో కరీంనగర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. తాను వరంగల్, హైదరాబాదులలో ఎక్కడా ఉండలేనని, ఎక్కడ ఉన్న తన తండ్రి తీసుకెళ్ళిపోతాడని, అనుదీప్ తో తనకు పెళ్లి జరిపించాలని, అప్పటివరకు తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. దీంతో ఆమెకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆమెను హైదరాబాద్ తరలించారు.

Comments