ప్రచురణ తేదీ : Sep 28, 2017 10:49 PM IST

కిలాడీ లేడి..ఓ పూజారి.. గుడిలో ఘోరం..!!

గుడిలో ఓ పాపాత్మురాలు చేసిన ఘోరం ఇది. ఢిల్లీకి చెందిన లఖన్ దూబే అనే పూజారితో మధురకు చెందిన మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. లఖన్ దూబే గుళ్లోని గాంధీ నగర్ లోని శివాలయంలో పూజారిగా చేస్తున్నాడు. కానీ భార్య మాత్రం స్వగ్రామంలోనే భర్తకు దూరంగా ఉంటోంది. భర్త దూరంగా ఉండడంతో గ్రామంలోని చంద్రశేఖర్ అనే యువకుడితో అక్రమ సంబంధానికి అలవాటు పడింది. రెండు నెలల క్రితం లఖన్ దూబే భార్యని తనతో ఢిల్లీకి తీసుకుని వెళ్లాడు. అప్పటికి ప్రియుడితో ఆమె ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. భర్త ఈ విషయాన్ని గ్రహించడంతో తప్పుని ఒప్పుకుని ప్రియుడిని భర్త తో కలసి హతమార్చడానికి పథకం వేసింది.

భర్త ఇంట్లో లేడని, వస్తే సరదాగా గడపొచ్చని ప్రియుడిని నమ్మించి రప్పించుకుంది. ఇంటికి వచ్చిన అతడికి నిద్రమాత్రలు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన అతడిని భర్తతో కలసి గుడిలోనే దారుణంగా హతమార్చింది. శవాన్ని గుడినుంచి బయటకు తరలించే పరిస్థితి లేకపోవడంతో గుడి పైనే కాల్చేశారు. గుడి నుంచి మాంసం కాలిన వాసనతో పొగలు రావడంతో ఓ స్థానికుడు గమనించాడు. పోలీస్ లకు సమాచారం అందించడంతో పోలీస్ లు భార్య భర్తల్ని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Comments