ప్రచురణ తేదీ : Dec 31, 2016 2:05 PM IST

`విన్న‌ర్` గ్రీటింగ్‌పై.. 2017 శుభాకాంక్ష‌లు

winner
సుప్రీంహీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న‌దైన శైలిలో విజృంభించేందుకు వ‌చ్చేస్తున్నాడు. విన్న‌ర్ లాంటి ప్రామిస్సింగ్ టైటిల్‌తో ఈసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. హాలీవుడ్ స్టైల్ ఫైట్స్‌తో తెర‌కెక్కుతున్న సినిమా ఇద‌న్న ప్ర‌చారం ఉంది. ర‌కూల్ ప్రీత్ సింగ్ అందచందాలు మ‌రోసారి ఈ చిత్రంలో విందు చేయ‌బోతున్నాయి.

విన్న‌ర్ కొత్త సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు చెప్పేశాడు. 2017 శుభాకాంక్ష‌లు అంటూ కొత్త పోస్ట‌ర్‌తో ఫ్యాన్స్‌కి ట‌చ్‌లోకి వ‌చ్చేశాడు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. కొత్త సంవ‌త్స‌రం వేళ `హ్యాపీ న్యూఇయ‌ర్ 2017` అంటూ .. వేసిన ఈ పోస్ట‌ర్ మీకోసం..

Comments