ప్రచురణ తేదీ : Sat, Apr 22nd, 2017

పార్ట్ 1 రికార్డులను బాహుబలి 2 దాటుతుందా..అనుమానం ఎందుకంటే..?


బాహుబలి మొదటి భాగం విడుదలకు ముందు ఇప్పుడు బాహుబలి 2 విడుదలకు ముందు ఏదైనా తేడా గమనించారా..కొంచెం లోతుగా పరిశీలిస్తే ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. అదే ప్రమోషన్ ల విషయంలో. బాహుబలి మొదటి భాగం విడుదలకు నెలరోజుల ముందునుంచే హడావిడి మొదలైపోయింది. బాహుబలి ఫస్ట్ లుక్ మొదలుకుని చిత్ర టీం ఒక ప్లాన్ ప్రకారం ప్రమోషన్ కార్యక్రమాలు చేసారు. బాహుబలి చిత్రంలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లు మంచి ఆసక్తిని రేపాయి.తెలుగులో తొలి సారి భారీ బడ్జెట్ వస్తున్న చిత్రం కావడంతో చిత్ర టీం ఓ రకమైన భయంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

కానీ బాహుబలి 2 విషయానికి వస్తే మొదటి భాగంకు చేసిన స్థాయిలో ప్రమోషన్ లు చేయడం లేదనేది వాస్తవం.బాహుబలి 2 పై భారీ అంచనాలు ఉన్న మాట వాస్తవమే. అది చాలులే అనే మితిమీరిన ఆత్మవిశ్వాసంలో చిత్ర టీం ఉందా అని అనిపించక మానదు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ 1000 కోట్ల వసూళ్లు సాధిస్తుందన్న ధీమాని కొంతమంది వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.దీనిపై లోతుగా విశేషిస్తున్న సినీవిశ్లేషకులు 1000 కోట్లు సాధ్యం కాదని అంటున్నారు. బాహుబలి మొదటి భాగం రికార్డులనైనా దాటుతుండగా అనేవాళ్లూ లేకపోలేదు. దీనికి కారణం చిత్ర టీం నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు మందగించడమే. బాహుబలి మొదటి భాగాన్ని మించి బాహుబలి 2 ఉంటుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించాలి. అది కేవలం ప్రమోషన్ల ద్వారా మాత్రమే సాధ్యం.విడుదలకు సరిగా వారం కూడా లేదు. ఇప్పటికైనా చిత్ర టీం ప్రమోషన్ల జోరు పెంచాలి అని అభిమానులు అంటున్నారు.

Comments