ప్రచురణ తేదీ : Dec 31, 2016 11:52 AM IST

పోలీసు ప్రియుడితో కలిసి మొగుడ్ని చంపేసింది

shdow
బ్రెజిల్ లో జరిగిన తాజా మర్డర్ మిస్టరీ ఇప్పుడిప్పుడే కొత్త కోణం లోకి ముదురుతోంది. గ్రీకు దౌత్యాధికారి అమిరిడిశ్ హత్య వెనకాల ఉన్న అక్రమ సంబంధం కోణాన్ని పోలీసులు బయటకి తవ్వుకోచ్చారు. సోమవారం నాడు అతను హత్యకి గురి అవ్వగా ఒక కారులో అతని బాడీ సగం సగం కాలి అక్కడ పడి ఉంది. ఈ కేసులో భార్య ఒలీవేరా తో పాటు ఆమె ప్రియుడు (పోలీస్) హస్తం ఉంది అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చెయ్యగా నిజం బయట పడింది.ప్రత్యక్షంగా హత్య చేయకున్నా కుట్ర గురించి ఒలివెరాకు తెలుసునని పేర్కొన్నారు. డిసెంబసర్ 21 నుంచి తన బార్యతో కలసి కిరియకోస్ రియో డీ జనీరో పర్యటనలో ఉన్నారని, వాస్తవానికి ఆయన జనవరి 9న బ్రెజిల్ కు చేరుకోవాల్సి వుందని తెలిపారు. ఈ కేసులో తొలుత పోలీసులకు ఇచ్చిన వాజ్మూలంలో, తన భర్త అద్దెకు తెచ్చిన కారుతో బయటకు వెళ్లాడని, ఆపై తిరిగి రాలేదని ఒలివెరా తెలిపింది. ఆపై విచారణలో అసలు నిజాన్ని ఒప్పకుందని పోలీసులు వెల్లడించారు.

Comments