ప్రచురణ తేదీ : Tue, Nov 1st, 2016

లవర్ తో కలిసి మొగుడుని దారుణంగా చంపేసిన పెళ్ళాం

knife
ఆమె కి పెళ్ళయ్యింది ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆమెకి పెద్ద మ్యాటర్ కానే కాదు. చివరికి ఈ వివాహేతర సంబంధాలు ఆమె తన సొంత భర్త నే చంపేసే స్థాయికి తీసుకుని వెళ్ళాయి. తన ప్రియుడితోనే కలిసి మొగుడ్ని కిరాతకంగా చంపేసింది. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలానికి చెందిన బొంత రాజు (32)కు హైదరాబాదులోని మాణికేశ్వరినగర్ కు చెందిన గంగతో ఏడేళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ కాప్రా సూర్యనగర్ కాలనీలో నివసిస్తూ, జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గంగకు తన తమ్ముడి స్నేహితుడు శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన బొంత రాజు, ఇది మంచిది కాదని పలుమార్లు హెచ్చరించాడు. కొన్నిసార్లు కొట్టాడు కూడా.
ఈ నేపథ్యంలో, తన సుఖానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో, భర్త అడ్డు తొలగించుకోవాలని గంగ ప్లాన్ వేసింది. ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చిన బొంత రాజు… యథాప్రకారం భార్యతో ఘర్షణ పడ్డాడు. భర్త నిద్రపోయిన తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది గంగ. ఇద్దరూ కలసి రాజు ఛాతిపై బలంగా కొట్టి, గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం, రాజు మృతదేహాన్ని చీరతో ఫ్యాన్ కు వేలాడదీసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ బంధువులకు, చుట్టుపక్కల వారికి నిన్న ఉదయం గంగ చెప్పింది.

Comments