ప్రచురణ తేదీ : Mar 22, 2018 5:33 PM IST

ఒక్క మనిషి కోసం ఇంత ప్రేమా! : నమ్రత మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు కు వున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. తండ్రి కృష్ణ గారి వారసత్వం తో టాలీవుడ్ లో ‘రాజకుమారుడు’ తో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్లు నేడు ఎవరూ ఊహించని అందనంత ఎత్తుకి ఎదిగారు. దానికి ప్రధాన కారణం కృష్ణ గారి లానే ఆయన కూడా కెరీర్ లో ఎన్నో ఎదురుదెబ్బలు తిని ఈ స్థాయికి వచ్చారు. అన్నిటికి మించి తండ్రి కృష్ణ గారి లానే ఎంత ఎదిగినా వొదిగి వుండే మంచి మనసు. ఒకప్పుడు బయటకు రావడానికి కొంత సిగ్గుపడే మహేష్ ప్రస్తుతం అభిమానులకు వీలైనంత ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు.

అయితే మహేష్ బాబుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేంత టైం ఉండదు కనక ఆ బాధ్యతను సతీమణి నమ్రతా శిరోద్కర్ రెగ్యులర్ గా పాటిస్తూ ఉంటారు. పిల్లలు గౌతం సితారకు సంబంధించిన పిక్స్ కాని తమ కుటుంబం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గడిపిన క్షణాలు కాని ఏవి చూడాలన్నా నమ్రతా ఎకౌంటు ను ఫాలో కావడమే. అందుకే తన ఫాలోయర్ల సంఖ్య భారీగా ఉంటుంది. తాజాగా నమ్రతా ఫాన్స్ కు థాంక్స్ చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేయటం ప్రస్తుతం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

‘భరత్ అనే నేను’ షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ వచ్చిన సందర్భంలో ఫాన్స్ ఆయన్ని చూడాలని ప్రయత్నించడం, సెల్ ఫోన్స్ లో షూట్ చేయటం నమ్రత వద్దకు వీడియో రూపంలో వచ్చింది. దీన్ని తన సోషల్ మీడియా ఎకౌంటు లో షేర్ చేసిన నమ్రతా, తను పెట్టిన మెసేజ్ లో అచ్చం మహేష్ మనసులో మాటలే చెప్పారు. ఒక్క మనిషి కోసం ఇంత ప్రేమా. మహేష్ బాబు, అలానే మా కుటుంబం పట్ల మీరు చూపుతున్న ప్రేమకు వెలకట్టలేమని అన్నారు.

మీ హద్దులు లేని ప్రేమకు థాంక్స్ అంటూ నమ్రతా పెట్టిన మెసేజ్, అభిమానులకు మహేష్ తరఫున గ్రీటింగ్స్ చెప్పేసింది. మహేష్ భార్య గానే కాకుండా తమ హీరో సినిమాలో హీరొయిన్ గా నటించిన నమ్రతా అన్నా ఫాన్స్ కు ప్రత్యేకమైన అభిమానం. మహేష్ నమ్రతలతో పాటు కృష్ణ కూడా నటించిన వంశీ సినిమా షూటింగ్ టైంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. మొత్తానికి తన మెసేజ్ ద్వారా అభిమానుల మనసులు మరో సారి గెలుచుకున్న నమ్రతా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది….

Comments