ప్రచురణ తేదీ : Jan 28, 2017 1:49 PM IST

హన్సిక ని నేను ముట్టుకో కూడదా ? – మోహన్ బాబు..!

mohan-babu
లక్కున్నోడు సినిమా మొన్న విడుదల అయిన సంగతి తెలిసిందే. టాక్ కాస్త అటూ ఇటూ గా వినిపిస్తూ ఉన్నా సినిమా కలక్షన్ లు బానే ఉన్నాయ్ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్ లు. ఈ సినిమా కి శుభాకాంక్షలు చెబుతూ హీరో మోహన్ బాబు ఒక కార్యక్రమం లో పాల్గొని హడావిడి చేసారు.పాండవులు పాండవులు తుమ్మెద.. అంతకు ముందు దేనికైనా రెడీ చిత్రాల్లో కలిసి నటించారు మంచు విష్ణు- హన్సికలు. ఇప్పుడిది వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అంటూ.. బెస్టాఫ్ లక్ చెప్పిన మోహన్ బాబు.. ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే.. హన్సిక చేతిని వదలకుండానే కాసేపు మాట్లాడిన ఆయన.. ‘ఓహ్.. చెయ్యి పట్టుకున్నాననా.. తను ఉన్నాడనా? ఏరా విష్ణు ఉన్నాడని చెయ్యి తాకకూడదా’ అంటూ విష్ణు వైపు చూసిన మోహన్ బాబు.. ‘చెయ్యి తాకచ్చు’ అంటూ ఆట పట్టించారు.

Comments