ప్రచురణ తేదీ : Nov 10, 2017 6:30 PM IST

క‌థానాయిక‌ల‌కు పెళ్లిపై విరక్తి ఎందుకు?

ఇంత‌కీ మీ పెళ్లెప్పుడు? 30ప్ల‌స్ క‌థానాయిక‌ల‌కు రెగ్యుల‌ర్‌గా ఎదుర‌య్యే ప్ర‌శ్న ఇది. అయితే య‌థావిధిగానే స‌ద‌రు నాయిక‌ల నుంచి అంతే స్పాంటేనియ‌స్ స‌మాధానం వ‌చ్చేస్తుంది. “ఇప్ప‌ట్లో ఆ ఆలోచ‌న లేదు. ఉన్న‌ప్పుడు నేనే చెబుతాను..“ అంటూ చాలా డిప్ల‌మాటిక్ ఆన్స‌ర్ తో స‌రిపెట్టేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ప్ర‌శ్న ఎదురైన‌ప్పుడు ఎలాంటి స‌మాధానం చెప్పాలి? అన్న‌ది ముందే ఫిక్స‌యిపోతారు మ‌న నాయిక‌లు. స‌రైన వాడు త‌గ‌ల్లేద‌నో, అలాంటివాడు క‌నిపించిన‌ప్పుడు క‌బురు పెట్టి మేమే చెబుతామ‌నో తెలివైన ఆన్స‌ర్ ఇచ్చేవాళ్లు ఉన్నారు. ఇక కెరీర్ గురంచి ఆలోచ‌న త‌ప్ప డేటింగుల గురించి ఆలోచించే స‌మ‌యం లేద‌నే ఆన్స‌ర్ వినిపిస్తుంటుంది. అయితే క‌థానాయిక‌లు ఇలా ఎందుకు చెప్పాల్సొస్తోంది? అంటే అందుకు ఎన్నో సందిగ్ధ‌త‌లు వారి జీవితాల్లో క‌నిపిస్తాయి.

నిన్న‌టికి నిన్న ఓ స‌మావేశంలో పెళ్లెప్పుడు అన్నందుకు..కాజ‌ల్ షాకిచ్చే ఆన్స‌ర్ ఇచ్చింది. కాజ‌ల్ వ్యాఖ్య ల‌కు మీడియా జ‌నం షాక్ తిన్నారు. ఇప్పుడే మూడ్ లేదు.. కెరీర్‌లో బిజీ. నాలుగేళ్ల త‌ర్వాత‌నే..అని చెప్పింది. అయితే పెళ్లి అనేది చేసుకునే ఆలోచ‌న ఉంద‌ని క్లారిటీనిచ్చింది కాజ‌ల్‌. అంతేకాదు.. కాబోయేవాడు అందగాడై వుండాలని కోరుకోవడం లేదు. కాకపోతే బాగా చూసుకునే నిజాయితీ ఉన్న‌, మనసున్న వ్యక్తి అయితే బెటర్ అంటూ అస‌లు సంగ‌తిని చెప్పింది. ఇక న‌య‌న‌తార‌, త్రిష లాంటి క‌థానాయిక‌ల్ని క‌దిలిస్తే పెళ్లి అన్న మాటే మ‌ర్చిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నారు. వారి జీవితాల్లో ఎదురైన ప‌లు ప‌రాభ‌వాలు అందుకు కార‌ణం కావొచ్చు. మెయిన్ స్ట్రీమ్‌లో స్టార్‌డ‌మ్ అందుకున్న క‌థానాయిక‌లు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాలే కానీ పెళ్లాడేందుకు వ‌రుల‌కు కొద‌వేం లేదు. కానీ ఎందుక‌నో పెళ్లి మ్యాట‌ర్ వ‌చ్చేస‌రికి మొహం చాటేస్తున్నారు మ‌న నాయిక‌లు. బాలీవుడ్‌లో క‌రీనా, బిపాసా త‌ర‌హాలో ఆలోచించ‌డం లేదెందుక‌నో. ఎండోర్స్‌మెంట్స్‌, భారీ సినిమా కాంట్రాక్టులు.. డీల్స్ ఇవ‌న్నీ ఏం కావాలి? అన్న ఆలోచ‌న ఓవైపు, పెళ్లాడిన యువ‌తికి ఇక ఛాన్సులు రావ‌న్న ఆలోచ‌న ఇంకో వైపు స‌ద‌రు నాయిక‌ల్ని ఇలా ఆలోచించేలా చేస్తుందేమో? ఇక న‌మిత లాంటి క‌థానాయిక ఉన్నట్టుండి బోయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడేస్తున్నాన‌ని చెప్పే స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయి. అయితే పెద్ద‌గా ఫేమ్ లేని నాయిక‌లు మాత్ర‌మే అలా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Comments