ప్రచురణ తేదీ : Jan 7, 2018 2:01 PM IST

`2.ఓ` ట్రైల‌ర్ ఎందుకు రిలీజ్ చేయ‌లేదు?

మ‌లేసియా – కౌలాలంపూర్‌లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించిన కోలీవుడ్ `స్టార్‌నైట్‌`లో ప‌లు సినిమాల ట్రైల‌ర్ల‌ను లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. సూర్య త‌న అప్‌కం రిలీజ్ `తానా సేంద్ర కూట్ట‌మ్‌` (గ్యాంగ్‌) ప్ర‌మోష‌న్ ఓ రేంజులో చేశారు. విజ‌య్‌సేతుప‌తి సినిమా ఆడియో వేడుక‌ను ఈ వేదిక‌పైనే చేశారు. ప‌లు చిత్రాల అధికారిక లాంచింగులు జ‌రిగాయి. అయితే ఇన్ని జ‌రుగుతున్న ఇదే వేదిక‌పై సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ -శంక‌ర్‌ల క్రేజీ మూవీ `2.ఓ` ట్రైల‌ర్‌ని ఎందుకు రిలీజ్ చేయ‌లేదు? అంటూ అభిమానులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. ఆ మేర‌కు త‌మిళ తంబీలు స‌హా ఇటు తెలుగువారైన ర‌జ‌నీ అభిమానుల్లోనూ నైరాశ్యం నెల‌కొంది.

వాస్త‌వానికి గ‌త కొంత‌కాలంగా మ‌లేషియాలో 2.ఓ ట్రైల‌ర్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేశార‌న్న ప్ర‌చారం సాగింది. ట్రైల‌ర్‌తో మెగా ఈవెంట్ గ్లింప్స్ అదిరిపోనుంద‌ని ప్ర‌చార‌మైంది. దాంతో అభిమానులంతా ఎన్నో ఆశ‌లు పెట్టుకుని ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ చివ‌రి నిమిషంలో నీరుగారుస్తూ ఈ ట్రైల‌ర్ లాంచ్ ఉండ‌ద‌ని తేల్చేశారుట‌. ఇదివ‌ర‌కూ హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సిన 2.ఓ ఈవెంట్ మ‌లేసియా షిఫ్ట‌యింద‌న్న ప్ర‌చారం సాగింది. అక్క‌డ ఎలానూ లేదు కాబ‌ట్టి క‌నీసం హైద‌రాబాద్ లో అయినా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ఉంటుందా? అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి లైకా ప్రొడ‌క్షన్స్ కానీ, శంక‌ర్ ష‌న్ముగం కానీ ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

Comments