ప్రచురణ తేదీ : Mon, Apr 23rd, 2018

నన్ను అనడానికి పవన్ స్థాయి ఏంటి : కత్తి మహేష్

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై అలానే తన తల్లిపై దుర్భాషలాడిన శ్రీరెడ్డి వీడియో ని ఇప్పటికే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఇలా తన తల్లిని తిట్టిస్తున్నారని, తనతోపాటు తన అభిమానులు, శ్రేయోభిలాషులను కూడా వదలట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పై మరొకసారి ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరొకసారి విరుచుకుపడ్డారు. ఆయన ఇటీవల ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ, పవన్ అభిమానులు జాగ్రత్తగా వ్యవహరించాలని, తనని అనవసరంగా అనడమేంటని అన్నారు. అసలు నన్ను అనడానికి పవన్ స్థాయి ఏంటని, ఆయన ఇంటర్ ఫెయిల్ అయితే, నేను పిజి చేసాను అన్నారు. అది గుర్తించాలని అన్నారు. పవన్ పెద్ద కాపు, తాను మాత్రం మడిగాని అన్నారు.

ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆయన పవన్ అభిమానులకు హితవు పలికారు. అసలు జరిగిన విషయం రాంగోపాల్ వర్మ బహిరంగంగా తేల్చి చెప్పారని అయినప్పటికీ ఈ వివాదంలో శ్రీరెడ్డిని, వర్మ ని దోషులుగా పదే పదే పవన్ టార్గెట్ చేయడం సరైనది కాదని కత్తి అభిప్రాయపడ్డారు. పవన్ జరిగిన ఈ విషయాన్నీ మరీ ఇంతలా సాగదీయకుండా, వాళ్ళని క్షమించివుంటే బాగుందేదని, అంతేకాని దీన్ని మరింత పెద్దదిగా చేయడం సరైనది కాదన్నారు. ఆయన పద్దతి చూస్తుంటే వాళ్ళ అమ్మని అడ్డంపెట్టుకుని రాజ్యకీయం చేస్తున్నట్లు కనపడుతోందని పవన్ ను కత్తి ప్రశ్నించారు. అసలు ఈ మొత్తం వివాదం లో చూస్తే కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే రాజకీయం చేస్తున్నారన్నారు. కావున పవన్ ఇకనైనా ఈ విషయాన్నీ ఇంతటితో వదిలేయాలన్నారు…..

Comments