ప్రచురణ తేదీ : Wed, Jul 19th, 2017

పోల్ : ‘బిగ్ బాస్’ షోలో 14 మంది నటుల్లో ఎవరు ఆకట్టుకుంటారని మీరు భావిస్తున్నారు?

ఎన్టీఆర్ సారధ్యంలో తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ఆదివారం చాలా అట్టహాసంగా స్టార్ట్ అయ్యింది. మొత్తం 14 మంది సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయారు. అయితే నిన్నటి వరకు ఎన్టీఆర్ పార్టిసిపెంట్స్ అందరిని తనదైన శైలిలో పరిచయం చేసి లోపలి పంపించాడు. అయితే షో లో పాల్గొన్న వారిని చూస్తే మాత్రం పెద్దగా ఆడియన్స్ కి ఆసక్తి కనిపించడం లేదని ప్రస్తుతం వినిపిస్తున్న మాట. మేగ్జిమమ్ షో లో పాల్గొన్న అందరు అందరు నటులే కావడం ఇప్పుడు పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. మరి ఇకపై ఈ 14 మంది పార్టిసిపెంట్స్ తో ఎలా నడుస్తుంది.? అందులో ఎవరు ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది అనే విషయం మీరే చెప్పండి.


Comments