ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

సెహ్వాగ్ ట్వీట్స్ విలువ రూ .30 లక్షలు..!!

shewag
మీరు విన్నది నిజమే..సెహ్వాగ్ తన ట్వీట్స్ ద్వారా గత ఆరునెలల్లో రూ 30 లక్షలు సంపాదించాడు. ఈ విషయం సెహ్వాగ్ స్వయంగా ప్రకటించడం విశేషం.ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విషయాలపై, సెలెబ్రిటీలపై ఈ వీరేంద్రుడు అత్యంత సులువుగా ట్విట్టర్ ద్వారా ఛలోక్తులు విసురుతాడు.తన ట్వీట్ లను చూసి రణవీర్ గతం లో పగలబడి నవ్విన విషయాన్ని సెహ్వాగ్ తెలిపిన విషయం తెలిసిందే.సెహ్వాగ్ ట్విట్టర్ లో వేసే ఛలోక్తులకోసం ఎదురుచూసే అభిమానులో లేకపోలేదు.

కాగా ప్రస్తుతం సెహ్వాగ్ తన ట్వీట్ ల ద్వారానే భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడట. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తన ట్వీట్స్ వైరల్ గా మారినపుడు స్పాన్సర్ లు వారంతట వారే వచ్చి తనని సంప్రదిస్తారని అన్నాడు. తన ట్వీట్స్ కి వేలసంఖ్యలో రీట్వీట్స్ వస్తాయని పేర్కొన్నాడు. గత ఆరునెలల్లో ట్వీట్స్ ద్వారా తాను రూ 30 లక్షలు సంపాదించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. అభిమానులకు తనట్వీట్స్ ద్వారా ఆనందాన్ని పంచుతూనే సెహ్వాగ్ డబ్బు కూడా సంపాదిస్తున్నాడన్న మాట.

Comments