ప్రచురణ తేదీ : Wed, Sep 13th, 2017

పెళ్లి దుస్తుల్లో కోహ్లీ, అనుష్క.. జంట అదిరిపోలా..!

విరాట్ కోహ్లీ, అనుష్క.. దేశంలోనే ప్రేమలో ఉన్న అతిపెద్ద సెలెబ్రిటీ జంట. వీళ్ల ప్రేమ వ్యవహారం రహస్యమేమీ కాదు. ఖండాంతరాలలో కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నా తన ప్రియుడి ఆట చూసేందుకు అనుష్క అక్కడికి వాలిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక తీరిక సమయాల్లో ఫారెన్ విధుల్లో షికార్లు కొట్టడం కూడా వీరికి కొత్త కాదు. ఇంతటి హాట్ టాపిక్ గా మారిన వీరి ప్రేమ ఎప్పుడు పెళ్లి పీటల వరకు చేరుతుందనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది. పెళ్లి మాట అటుంచితే ఈ జంట అప్పుడే పెళ్లి దుస్తులు ధరించేసారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఓ యాడ్ షూట్ కోసం ఈ జంట పెళ్లి దుస్తులు ధరించినట్లు తెలుస్తోంది. ఈ యాడ్ టీవీల్లో ప్రసారం కానుంది. కోహ్లీ నవ మన్మధుడిలా అనుష్క వంక వాలు చూపు చూస్తుంటే ఆమె చిరునవ్వు చిందిస్తూ వెలిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి దుస్తుల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్ అంతే. అనుష్క, కోహ్లీ మధ్య పరిచయం ఏర్పడింది కూడా యాడ్ షూట్ వలనే. షాంపూ యాడ్ కోసం కోహ్లీ అనుష్క తొలిసారి నటించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది.

Comments