ప్రచురణ తేదీ : Jan 24, 2017 5:15 PM IST

యాంకర్ సుమ పెద్ద అబద్దాల కోరు అంటున్న రచయిత…!

suma
దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీవల్లి’ సినిమా ఆడియో కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రచయిత అనే పదానికి విజయేంద్రప్రసాద్ కొత్త నిర్వచనం చెప్పారు. అబద్దాలు ఆడేవారు రచయితలుగా రాణిస్తారని ఆయన చెప్పారు. అంతేకాదు తాను పెద్ద అబద్దాలకోరు అని ఆయన అన్నారు. రెండు సంవత్సరాల క్రిందట వారం వ్యవధిలో విడుదలైన ‘బాహుబలి’ ‘భజరంగీ భాయిజాన్’ సినిమాలు విడుదలై ఘన విజయాలు సాదించినపుడు తనకంటే పెద్ద అబద్ధాలకోరు ఇంకెవరూ లేరు అనుకున్నానని అన్నారు.

అయితే నాకంటే పెద్ద అబద్ధాలకోరు కూడా ఉన్నారని, ఆ విషయం తనకు తరువాత తెలిసింది అన్నారు. ఆమె నాకంటే అందంగా అబద్దాలు చెప్పగలిగే వ్యక్తి అని, ఆమె అబద్దాలు ఆడడంలో నాకంటే కిలోమీటర్ ముందు ఉందని అన్నారు. ఆ వ్యక్తికి మలయాళం కూడా వచ్చు అని ఆమె ఎవరో కాదు యాంకర్ సుమ అని చెప్పారు. ఆడియో వేడుకల్లో ఆమె చాలా అబద్దాలు ఆడుతుందని, వచ్చిన అతిధులందరినీ ‘ఇంద్రుడు. చంద్రుడు’ అని పొగుడుతుందని, సినిమా గురించి లేనిపోని అబద్దాలు ఎన్నో చెప్తుందని విజయేంద్రప్రసాద్ చమత్కరించారు.

Comments