ప్రచురణ తేదీ : Dec 2, 2017 10:57 AM IST

టాక్సీ వాలా గా మారిన విజయ్ దేవరకొండ ?

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం రేపిన విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా మారిన విజయ్ తాజాగా కొత్త దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తీ కావొచ్చినా ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. గీత ఆర్ట్స్, యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శిఖర్ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు .. కానీ ఆ టైటిల్ ఇప్పటికే మరో సినిమాకు ఉపయోగించడంతో .. తాజాగా టాక్సీ వాలా అనే పేరును ఖరారు చేసేలా ఉన్నారు. విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తున్న ఈ సినిమా కథ మొత్తం టాక్సీ చుట్టే తిరుగుతుందట! ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తరువాత విజయ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా, దాంతో పాటు మరో రెండు సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.

Comments