ప్రచురణ తేదీ : Tue, May 8th, 2018

డియర్ కామ్రేడ్ తో మళ్ళీ వస్తున్న విజయ్ దేవరకొండ…

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో అలరించిన విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు చిత్రంతో అందరి దృష్టిలో పడ్డాడు.అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక అప్పటి నుండి విజయ్ దేవరకొండకి పెద్ద బేనర్స్‌ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల టాక్సీవాలా అనే చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ మహానటిలో విజయ్ ఆంటోని పాత్ర పోషించాడు. ఈ రెండు చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో గీతా గొవిందం సినిమా చేస్తున్నాడు విజయ్.

భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్ర నిర్మాతలలో ఒకరైన యాష్‌ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రేపు చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ అనే టైటిల్ చిత్రానికి ఖరారు చేయగా, ఇందులో విజయ్ కాకినాడ యాసలో మాట్లాడనున్నాడట. కొత్త అమ్మాయిని కథానాయికగా తీసుకోనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం నోటా అనే బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు.

ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట విజయ్. ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి అర్జున్ రెడ్డితో అదిరిపోయే హిట్ అందుకున్న విజయ్ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నాడు.

Comments