ప్రచురణ తేదీ : Nov 15, 2017 11:02 AM IST

భారతీయ సంస్కృతి అందుకోసమే .. అంటూ విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్ ?

బాలీవుడ్ సంచలన తారా విద్యా బాలన్ .. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపడం మనం చూస్తున్నదే. తాజాగా ఆమె భారతీయ సంస్కృతి గురించి ఘాటుగా స్పందించింది. వివాహం అనేది .. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే అని .. అదే భారతీయ సంస్కృతి అని పేర్కొంది? సన్నిహిత్యంలోనే ఆనందం ఉందని, సెక్స్ అనేది ఓ భావన మాత్రమే అని, అది చర్య కాదనే సందేశాన్ని ఇవ్వాలని ఉద్దేశం ఉందని చెప్పింది. ఇంత పెద్ద భారత దేశంలో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది !! వివాహం ద్వారానే లైంగిక వాంఛలను తీర్చుకోవాలని భారతీయ సంస్కృతి చెబుతుందని … ఇది కేవలం పునరుత్పత్తి కి సంబందించిన అంశమని, కానీ సన్నిహిత్యంలోని ఆనందాన్ని చేలా మంది కోల్పోతున్నారని ఘాటు వ్యాఖలు చేసింది. మరి విద్యా బాలన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి.

Comments