ప్రచురణ తేదీ : Dec 4, 2017 5:01 PM IST

‘తొలిప్రేమ’ ఫస్ట్ లుక్ : వరుణ్ తేజ్ నెత్తిన పెద్ద భారం..!

ఫిదా వంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో తొలి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలోని వరుణ్ కూల్ లుక్ అందరిని ఆకట్టుకుంది. మరో మారు వరుణ్ అదే జోనర్ మూవీ ట్రైచేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ ని కొద్ది సేపటి క్రితమే విడుదుల చేశారు. వరుణ్ తేజ్ కూల్ లుక్ లు ఆకట్టుకుంటున్నాడు. కాగా ఈ చిత్ర టైటిల్ ‘తొలి ప్రేమ’గా ఫిక్స్ చేయడం విశేషం.

తొలి ప్రేమ అనగానే పవన్ ఆల్ టైమ్ క్లాసిక్ గుర్తుకు రావడం ఖాయం. వరుణ్ బాబాయ్ సినిమా టైటిల్ తో రానుండడంతో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. అదే సమయంలో వరుణ్ పై ఒత్తిడి కూడా పెరుగుతుందని అంటున్నారు. పవన్ తొలిప్రేమతో దీనికి సంబంధం లేకున్నా మెగా అభిమానుల్లో మాత్రం ఆ అంచనాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ చిత్రానికి దీనికి పోలికలు సహజంగానే పెడుతారు. ఈ నేపథ్యంలో వరుణ్ వారి అంచనాలు అందుకోవాలంటే కష్టపడాల్సిందే. కాగా ఫస్ట్ లుక్ తో పాటు చిత్ర యూనిట్ మరో స్టిల్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ లో కూల్ కాగా వరుణ్ కనిపిస్తుంటే, మరో స్టిల్ లో గడ్డంతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 9 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Comments