ప్రచురణ తేదీ : Nov 9, 2017 2:52 PM IST

ఫిదా 2 లో వరుణ్ తేజ్.. ఈ సారి శేఖర్ కమ్ముల కాదు

ఫిదా సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వరుణ్ తేజ ప్రస్తుతం తన నెక్స్ట్ కథలను ఫాస్ట్ ఫాస్ట్ గా ఒకే చేస్తున్నాడు. ఫిదా సినిమా తర్వాత వరుణ్ తొలి ప్రేమ సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. అయితే ఈ సినిమా తర్వాత వరుణ్ మళ్లీ మరో ఫిదా కథతో రాబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆ కథకు ఫిదా 2 అనే టైటిల్ నే ఫిక్స్ చేశారని సమాచారం. నిన్ను కోరి సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఫిదా 2 ను తెరకెక్కించే అవకాశం ఉందట. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయి. ఫిదా లో వరుణ్ సాయి పల్లవి కోసం ఎంతగా స్ట్రగుల్ అయ్యాడో తెలిసిందే. ఇప్పుడు అదే తరహా పాత్ర ఫిదా 2 లో కూడా ఉంటుందట. కాకపోతే శివా నిర్వాణ కథలో కాస్త కొత్తదనం చూపిస్తాడని తెలుస్తోంది. కథ మొత్తం సెట్ అయ్యి వరుణ్ కి నచ్చితే సినిమాను డీవీవీ దానయ్య నిర్మించడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Comments