ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

కొద్ది విరామం తరువాత రాంగోపాల్ వర్మ మళ్ళీ మొదలెట్టాడు.

rgv
ఎవరినైనా పొగడాలన్నా, ఎవరినైనా తిట్టాలన్నా డేరింగ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకే చెల్లింది. దేశంలో ఉన్న ప్రముఖులలో చాలామందిని ఆయన విమర్శించిన, పొగిడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొద్ది రోజుల నుండి చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలపై రాంగోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్లు కొంతమందిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. తమ హీరోను విమర్శిస్తున్నాడని చిరంజీవి అభిమానులు వర్మపై గుర్రుగా ఉన్నారు. అంతేకాదు ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో నాగేంద్రబాబు రాంగోపాల్ వర్మపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. దీంతో చిర్రెత్తిన వర్మ నాగేంద్రబాబు ను విమర్శిస్తూ వరుసగా రెండు రోజులు ట్వీట్ల వర్షం కురిపించాడు.

కానీ నాలుగు రోజులు నుండి మౌనంగా ఉన్న వర్మ ప్రస్తుతం బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు విడుదల కావడంతో మళ్ళీ తన ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వర్మ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇచ్చిన తీర్పు నిజం కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అరువు తెచ్చుకున్న కథతో కాకుండా, యదార్థ కథతో తెలుగు సినిమా ఖ్యాతిని ఆకాశానికి తీసుకెళ్లారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బాలకృష్ణ 100వ సినిమా 150 సార్లు గొప్పగా ఉందనే అర్ధంతో వర్మ ట్వీట్ చేశారు. దర్శకుడు క్రిష్ కు, హీరో బాలకృష్ణకు 100 చీర్స్ అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నాడు.

Comments