ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

బ‌ద్ధ శ‌త్రువులు ఒక్క‌టై .. మూకుమ్మ‌డి పోరుకు సిద్ధం!

uttam-kumar-reddy
ఆ ముగ్గురూ బ‌ద్ధ శ‌త్రువులు. ఒక‌రంటే ఒక‌రికి గిట్ట‌దు. ఎదురుప‌డితే ప‌ల‌క‌రింపులైనా ఉండ‌వు. మాట‌వ‌ర‌స‌కైనా ఓ మాట వేయ‌రు. అలాంటివాళ్లు ముగ్గురూ ఏక‌మ‌య్యారు. దోస్తీ క‌ట్టారు. అయితే ఇదంతా ఎందుకంటే ప్ర‌త్య‌ర్థిపై ఉమ్మ‌డి పోరాటం చేసేందుకు. కోల్పోయిన ప్ర‌భ‌ను తిరిగి తెచ్చేందుకు. పార్టీ జ‌వ‌స‌త్వాలు నింపేందుకు. అస‌లింత‌కీ ఎవ‌రా ముగ్గురు? అంటే కాంగ్రెస్ నాయ‌కులు జానా రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురు నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చి అక్క‌డ‌ కలిసి భోంచేశారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై చ‌ర్చాగోషి న‌డిపిచారు.ఇదంతా చూసిన వారికి ఎలుక‌- పిల్లి స్నేహం క‌థ గుర్తొచ్చింది.

అస‌లు తెలంగాణ ఇవ్వ‌డంలో కాంగ్రెస్ పాత్ర‌ను మ‌రిచిపోయే రేంజులో బొంద పెట్టిన నేత‌లు వీరు .. అన్న టాక్ తెలంగాణ‌లో ఉంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక‌, అంత‌ర్గ‌త వ‌ర్గ‌పోరాటాల‌తో పార్టీని నేల నాకించిన నేత‌లుగానూ పాపుల‌ర‌య్యారు. అయితే ఇన్నాళ్టికి కాస్త బుద్ధొచ్చింది. క‌లిసి ప‌ని చేద్దామ‌న్న ఇంగితం తెలిసింది. డ్యామేజీ పూడ్చేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌నిపించింది. అయితే ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంది. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకెంతో స‌మ‌యం లేదు. మ‌రి ఇప్ప‌టికిప్పుడు ఈ ముగ్గురు శ‌త్రువులు క‌లిసి ఏం చేస్తారో చూడాలి. మ‌రోవైపు అధికార తేరాస ఎదురేలేని పార్టీగా తెలంగాణ‌ను గుప్పిట ప‌ట్టేసింది. మ‌రి వీళ్లు ఏం చేస్తారో చూడాల్సిందే.

Comments