ప్రచురణ తేదీ : Sep 28, 2017 5:39 PM IST

పవన్ సినిమాకి ఉదయభాను స్పెషల్ అట్రాక్షన్..?


టైటిల్ ఇంకా ఖరారు కానీ పవన్ – త్రివిక్రమ్ ల చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు అబ్బుర పరుస్తాయని సమాచారం. సంగీత దర్శకత్వం మొదలుకుని అని విభాగాల్లో ఈ చిత్రం కోసం టాప్ మోస్ట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు ఆడిపాడనున్నారు. కాగా ఈ చిత్రానికి యాంకర్ ఉదయభాను మరో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నట్లు సమాచారం.

ఉదయ భాను ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో పవన్ పక్కన డాన్స్ చేయనుంది. ఉదయ భాను గతంలో త్రివిక్రమ్ చిత్రం జులాయి, శేఖర్ కమ్ముల చిత్రం లీడర్ లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. తాజాగా త్రివిక్రమ్ ఉదయ భానుతో సంప్రదింపులు జరిగిపినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్ర టైటిల్ విషయంలో ఇంకా మీమాంస కొనసాగుతూనే ఉంది.

Comments