ప్రచురణ తేదీ : Tue, Jan 10th, 2017

రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వదులుకున్నా అంటున్న చంద్రబాబు

babu
చెన్నైలో ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇండియా టుడే సంపాదకులు రాజదీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడును రానున్న రోజుల్లో కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా అని సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు యునైటెడ్ ఫ్రంట్ హయాంలో తనకు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని చంద్రబాబు అన్నారు. కానీ రాష్ట్ర రాజకీయాలకే తన ప్రాధాన్యత అని చెప్పి ఆ అవకాశాన్ని కాదనుకున్నానని, తాను ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నానని చంద్రబాబు చెప్పారు.

గత యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించిందని దానివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం రైతులు వేలాది ఎకరాలను స్వచ్చందంగా ఇవ్వడానికి ముందుకొచ్చారని ఆయన ప్రశంసించారు. తెలుగుదేశం ప్రభుత్వంపై వైస్సార్సీపీ పార్టీ చేస్తున్న ఆరోణలను తాను పట్టించుకోనని అన్నారు. జైలుకి వెళ్లొచ్చిన వ్యక్తుల మాటలను ఎవరూ నమ్మరని, ఎవరు ఎన్ని విధాలా విమర్శించినా తన పని తాను చేసుకుంటూపోతానని అన్నారు. అమరావతిని ప్రపంచ శ్రేణి ఉత్తమ నగరాల్లో ఒక్కటిగా నిర్మించాలనేది తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.

Comments