ప్రచురణ తేదీ : Dec 5, 2017 5:24 PM IST

నాగ్‌-ఆర్జీవీ `సిస్ట‌మ్‌`పై `గ‌న్‌` ఫైరింగ్‌?

కింగ్ నాగార్జున‌- ఆర్జీవీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `శివ‌` నాటి బెజ‌వాడ రౌడీయిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వ‌ర్మ అండ‌ర్‌వ‌ర‌ల్డ్ మాఫియా, ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ క‌థ‌ల‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫేమ‌స్ అయ్యాడు. శివ త‌ర్వాత‌ నాగార్జున‌తో ప‌లు ఫ్లాప్‌లు తీసిన వ‌ర్మ .. బాలీవుడ్ వెళ్లి అక్క‌డ బిగ్‌బి అంత‌టి స్టార్‌తో వ‌రుస హిట్లు తెర‌కెక్కించాడు. ఫ్యాక్ట‌రీ పేరుతో ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల హ‌బ్‌నే త‌యారు చేశాడు. ఇంత‌టి స‌త్తా ఉన్న వ‌ర్మ ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా ఫెయిల‌వుతున్నాడు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి త‌న‌ని తాను బ‌య‌ట‌ప‌డేసుకునేందుకు తిరిగి నాగార్జున‌తో క‌లిసి ఓ ట్ర‌య‌ల్ వేస్తున్నాడు.

ఈసారి సిస్ట‌మ్‌పై కాన్‌స‌న్ ట్రేట్ చేసి, ఓ కాప్ డ్రామాని తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించి అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఇక ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే సంథింగ్ స్పెష‌ల్గా ఉంటుద‌ని వ‌ర్మ ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు గుప్పించాడు. శివ బ్యాచ్ ఈసారి ఏదో ఒక కొత్త‌ద‌నం తేబోతోంద‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. ఆ అంచ‌నాలకు త‌గ్గ టైటిల్‌ని వెత‌క‌డం ఇప్పుడు ఆర్జీవీకి త‌ల‌కుమించిన భార‌మే అవుతోందిట‌. త‌న సినిమాకి `గ‌న్‌` లేదా `సిస్ట‌మ్‌` అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ రెండిటిలో ఏ టైటిల్ మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌.. ఏది సూట‌బుల్ అన్న‌ది నిర్ణ‌యించాల్సి ఉంది. ఈ క్రేజీ చిత్రంలో నాగ్‌కు జోడీగా మైరా సరీన్‌ నటిస్తోంది. ఇత‌ర‌త్రా వివ‌రాల్ని వ‌ర్మ స్వ‌యంగా వెల్ల‌డిస్తారేమో వేచి చూడాల్సిందే.

Comments