ప్రచురణ తేదీ : Mon, Sep 7th, 2015

ఫేస్ బుక్ కిలేడీలు.. ఫేస్ తో అబ్బాయిలను బుక్ చేశారు!

kiladi
హైదరాబాద్ పోలీసులు తాజాగా ఫేస్ బుక్ ను వేదికగా చేసుకుని అబ్బాయిలకు వలవేసి డబ్బులు లాగుతున్న ఇద్దరు కిలాడీ అమ్మాయిల గుట్టును రట్టు చేశారు. ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి ఫేస్ బుక్ లో ఒక్కొక్కరు 15 నుంచి 20 అకౌంట్లు క్రియేట్ చేసుకుని, వాటికి అందమైన అమ్మాయిల ఫోటోలను తమ ఫ్రొఫైల్ ఫోటోలుగా పెట్టారు.

దీంతో ఆ ఫోటోలను చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిన అబ్బాయిలందరినీ వారు ఫ్రెండ్ గా యాడ్ చేసుకున్నారు. అలాగే తమ ఫోన్ నెంబర్లను కూడా అందులో పెట్టి అబ్బాయిలకు గాలం వేశారు. దీంతో వారి వలలో చాలా మంది అబ్బాయిలు పడ్డారు. ఈ నేపధ్యంలో అబ్బాయిలు వేలకు వేలు వారికి సమర్పించుకున్నారు. ఓ యువకుడు ఏకంగా తన దగ్గర ఉన్న 40 వేల రూపాయలు విలువచేసే కెమెరానే ఇచ్చేశాడు.

ఈ విధంగా ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి వందల మంది అబ్బాయిలను మోసం చేశారు. తాజాగా బాధితులంతా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను డిసిపి సత్యనారాయణ వివరిస్తూ.. వీలైనంత మేరకు ఏయే సెక్షన్లు వర్తిస్తాయో, ఎన్ని కేసులు పెట్టొచ్చో అన్ని కేసులను పెడతామని ఆయన తెలిపారు. అలాగే వారు ఖచ్చితంగా ఎంతమంది వద్ద డబ్బులు తీసుకున్నదీ తెలియదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 17 మంది యువకులను పిలిపించి విచారించినట్లు సమాచారం. కాగా, ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ వచ్చి ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు, మిస్సింగ్ కేసు అనుకుని విచారిస్తే ఈ వ్యవహరం మొత్తం తెలిసిందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

Comments