ప్రచురణ తేదీ : Tue, Sep 15th, 2015

తల్లి కూతుర్లతో ఆ కథ నడిపాడు .. చివరకు అంతమైపోయాడు..!

arrest
పెళ్ళయ్యి పిల్లలున్న ఓ వ్యక్తి.. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా.. అతడు ఆమె కూతురితో కూడా అదే సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలం అది సజావుగానే సాగింది. కాని, చివరకు అది బయటపడటంతో.. ఆ తల్లి కూతుర్లు అతగాడిని హత్య చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే..

కర్నూలులోని ప్రకాష్ నగర్ లో నాగశేషు అతని కుటుంబం నివాసం ఉంటున్నది. అయితే, నాగశేషు స్థానికంగా ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా.. ఆమె కూతురు తో కూడా చాటుగా అదే సంబంధాన్ని కొనసాగించాడు. అయితే, కొంతకాలం ఇది సజావుగా సాగింది. ఈ విషయం సోమవారం రోజున బట్టబయలు కావడంతో ఆగ్రహం చెందిన ఆ తల్లి కూతుర్లు నాగశేషును దారుణంగా హత్యచేసి.. గొనెసంచిలో కుక్కి ఊరి చివరనున్న ముళ్ళపొదల్లో పడేసి కిరోసిన్ పోసి తగలబెట్టారు. అయితే, ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఈశ్వరమ్మను ఆమె కూతురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Comments