ప్రచురణ తేదీ : Tue, Sep 12th, 2017

స్నేహితురాలిని ట్రాప్ లోకి దించి పోర్న్ సైట్లలో..!

మహిళల వేధింపుల దారుణానికి టెక్నాలజీ తోడవుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన సంజయ్ అనే వ్యక్తి ఓ టివి ఛానల్ లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మిర్యాలగూడలో జరిగిన టివి సీరియల్ షూటింగ్ లో అతడికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత పరస్పరం ఇద్దరూ సామజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకుంటూ ఉండేవారు.

ఓ రోజు ఆ యువతిని ట్రాప్ లోకి దించిన అతడు ఆమె ప్రయివేట్ భాగాలు చూపించేలా చేశాడు. ఆ యువతికి తెలియకుండానే ఆ వీడియోని రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనతో గడప కుంటే వీటిని పోర్న్ సైట్ లలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీనితో ఆ యువతి అతడిని గట్టిగా మందలించింది. చివరకు సంజయ్ ఆ వీడియోల్ని పోర్న్ సైట్ లవ్ పోస్ట్ చేసేశాడు. బాధితురాలు రాచకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ జరిగిపిన పోలీస్ లు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు.

Comments