ప్రచురణ తేదీ : Tue, Oct 27th, 2015

హైదరాబాద్ లో ‘వెంకటేశ్వరస్వామి’..!

tirupati
చిత్తూరు జిల్లా తిరుమలలో తాజాగా టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని పాలక మండలి నిర్ణయించింది.

ఈ సందర్భంగానే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర అరబిందో నేత్రాలయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏడు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.100 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు భేటీ అనంతరం తెలిపారు. అలాగే ఈ భేటీలో టీటీడీ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. అవి ఏమిటంటే.. శ్రీవారి సేవలు, లడ్డూ, అతిథి గృహాల ధరల పెంపుపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం, ఈనెల 30 నుంచి ఢిల్లీలో శ్రీనివాస వైభవోత్సవాల నిర్వహణ, తిరుపతి కళ్యాణి డ్యాం నిర్వహణ బాధ్యతలు రెండేళ్ళ పాటు ఎల్ అండ్ టీ కంపెనీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Comments