ప్రచురణ తేదీ : Sat, Jan 28th, 2017

ట్రంప్ నిర్ణయం నా గుండె ని పగలగొట్టింది

malala
ముస్లిం శరణార్ధులని అడ్డుకుంటా అంటూ డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయం తనని చాలా బాధ పెడుతున్నాయి అంటోంది నోబెల్ గ్రహీత పాక్ సాహస బాలిక మలాలా. ట్రంప్ నిర్ణయంతో తన గుండె పగిలి పోయిందని చెప్పింది. ఎలాంటి ఆశ్రయం లేని వారిని నిషేధించడం సరికాదని తెలిపింది. శరణార్థులను ఆదరించాలని కోరింది.

2014లో భారత్ కు చెందిన కైలాశ్ సత్యార్థితో పాటు మలాలా నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ఈ అవార్డును అతి చిన్న వయసులోనే అందుకున్న ఘనతను సాధించింది. 2012లో మలాలాపై తాలిబన్లు దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఇంగ్లండ్ లో ఆశ్రయం పొందుతోంది.

Comments