ప్రచురణ తేదీ : Jan 29, 2017 12:52 PM IST

ట్రంప్ నిర్ణయం తరవాత గంటల్లోనే మసీదు కి నిప్పు

Trump
ముస్లిం లకి అమెరికా లో అనుమతి ఇచ్చే విషయం లో సంచలన నిర్ణయాన్ని తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బతో ప్రపంచం అంతా షాక్ లో ఉంది. ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం ఇబ్బందికర విషయమే. ముస్లిం మెజారిటీ ఉన్న దేశాల యొక్క వలసలు ట్రంప్ దాదాపుగా నిషేధించారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధి లోనే టెక్సాస్ లో ఒక ముస్లిం ప్రాధనా మందిరానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం షాకింగ్ గా మారింది. టెక్సాస్ లోని విక్టోరియాలోని ఈ ప్రార్థనాలయానికి తెల్లవారుజామున నిప్పు పెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రార్థనాలయంలో దొంగలు పడ్డారు. ఈ ఘటనను మరవక ముందే.. దీనికి నిప్పు పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Comments