ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

ట్రంప్ కి కోపం అస్సలు ఆగడం లేదు.. పళ్ళు కొరుకుతూ..


అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ ప్రస్తుతం ఉత్తర కొరియా తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. గత కొన్ని రోజులుగా కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రవర్తన కు విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు ఇక యుద్ధం చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నామని కొరియా మా బలాన్ని తక్కువ అంచనా వేయొద్దని ఒక వేల యుద్ధం వస్తే కొరియా దేశ నామ రూపం లేకుండా పోతుందని గట్టిగా పళ్ళు కొరుకుతూ.. వార్నింగ్ ఇచ్చాడు.

అదే విధంగా ఉత్తరకొరియా గ్వామ్‌పై దాడి చేస్తామని చెబుతోంది. ఒక వేళ అక్కడ చిన్న తుపాకీ తూటా పేలినా రాత్రికి రాత్రే యుద్ధానికి సిద్ధమంటూ ట్రంప్ ఆవేశంతో ఊగిపోయారు. ప్రస్తుతం ఈ తరహా వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా కొరియా సమీపాన ఉన్న కొన్ని దేశాలు చాలా భయపడుతున్నాయి. చాలా మీడియా సంస్థలు కిమ్ ఒక్క బాంబు పేల్చే లోపు అమెరికా కొరియాని నామరూపం లేకుండా చేయడం ఖాయమని కథనాలు ప్రసారం చేస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిని కూల్ చేసేందుకు ఐక్యరాజ్య సమితి మొన్నటి వరకు బాగానే కష్టపడింది. కానీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Comments