ప్రచురణ తేదీ : Sep 27, 2017 12:30 PM IST

ఆ హీరోతో ఘాటు ఎఫైర్ సాగిస్తున్న పూరి హీరోయిన్ ?


ఆ మధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని వ్యవహారం గురించే బి టౌన్ మీడియా కోడై కూస్తుంది. లోఫర్ తో టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని కలలుగన్న ఈ అమ్మడికి ఆ సినిమా ప్లాప్ తో ఆ ఆశలు తీరలేదు, దాంతో మళ్ళీ బాలీవుడ్ లోనే ప్రయత్నాలు మొదలు పెట్టి .. అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ హాట్ భామ ఓ హీరోతో ఘాటు ఎఫైర్ సాగిస్తుందని తెగ వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి తిరుగుతున్నారని, ఒకే ఇంట్లో ఉంటున్నారట. ఆ హీరోతో కలిసి ఈ అమ్మడు ఓ సినిమా కూడా చేసింది. ఇంతకి ఆ హీరో ఎవరో తెలుసా .. జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ? ఇద్దరు కలిసి ఓ సినిమా చేసినప్పటినుండి వీరి మధ్య ప్రేమాయణం సాగుతుందని, లేటెస్ట్ గా డేటింగ్ కూడా మొదలు పెట్టారని, కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని .. ప్రచారం జరుగుతోంది. దానికి తోడు .. ఇద్దరు కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫోటో బయటికి రావడంతో వీరి వ్యవహారం బయటకు పొక్కింది ? పైగా ఈ అమ్మడు అతగాడితో బ్లూ బికినిలో హీటేక్కించేలా, దగ్గరగా వాటేసుకున్నా ఫోటో అది? ఆ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అన్నారు. మొత్తానికి చేతిలో సినిమాలు లేకపోయినా .. ప్రేమాయణం మాత్రం పట్టేసింది అని అంటున్నారు సినీ జనాలు !!

Comments