ప్రచురణ తేదీ : Sat, Mar 3rd, 2018

నేను మేకప్ వేస్కోకపోవడానికి సీక్రెట్ ఇదే..!

డీ డ్యాన్స్ రియాలిటీ షోలో మెరుపు తీగలా ఇలావచ్చి అలావెళ్ళిపోయి, తిరిగి ఏకంగా పెద్ద సినిమాతో మళ్ళీ మనముందుకు వచ్చి, మలయాళంలో ‘ప్రేమమ్‌’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సాయిపల్లవి. కాలేజీ లెక్చరర్‌గా ఆమె పోషించిన పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను తన కైవసం చేసుకుంది. కుందనపు బొమ్మ, మలయాళ కుట్టి అయినప్పటికీ కుడా.. ఫిదా సినిమాలో అచ్చ తెలంగాణ అమ్మాయిలా నటించి ఇటు తెలుగు సినీ అభిమానుల మనసుకు కుడా దగ్గరైపోయింది. ప్రస్తుతం కణం సినిమాతో మరోసారి తెలుగు ప్రజలను అలరించబోతుంది. అయితే నిజానికి ఆమె నటించిన తొలి సినిమా దగ్గరి నుంచి సాయిపల్లవి మేకప్‌ వేసుకోకుండా నటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె మేకప్‌కు ప్రాధాన్యత ఇ‍వ్వదని ఇట్టే తెలిసిపోతుంది. తాను మేకప్‌ వేసుకోకుండా నటించడానికి గల అసలైన కారణాన్ని సాయిపల్లవి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు రివీల్‌ చేసింది.

సామాన్యంగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ముఖంపై పింపుల్స్ కావడం సహజం అని, తన ముఖంపై మొటిమలు చూసి భయపడిన టీనేజర్లలో తానూ ఒకదాన్నని, కొన్నిసార్లు తన ముఖాన్ని చున్నీతో కప్పుకొని దాచుకునే దాన్ని అని తెలిపింది. అయితే ‘ప్రేమమ్‌’ షూటింగ్‌ సమయంలో తన ఆలోచనలో మార్పు వచ్చిందని, ఇలా పింపుల్స్ ఉన్నంత మాత్రాన ఏమీ కాదని, టాలెంట్ ఉంటే సరిపోతుందని, ప్రేమమ్‌ డైరెక్టర్‌ ఆల్ఫోన్స్ పుతరెన్, తనను కాస్మోటిక్స్‌ వాడకుండా సహజంగా నటించడానికి ప్రోత్సహించారని ఆమె చెప్పింది. ఇలా డైరెక్టర్లందరూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, మేకప్‌ వాడకుండా నటించడానికి తమవంతు ప్రోత్సహం చేసారని పేర్కొంది. తనలాంటి అమ్మాయిలందరికీ ఆత్మస్థైరాన్ని నింపడానికి ఇది ఒక ప్రయత్నమని సాయిపల్లవి తెలిపింది. భవిష్యత్తులో కూడా మేకప్‌ లేకుండా నటించడానికే ఇష్టపడతానని, ఈ విషయంలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పింది.

Comments