ప్రచురణ తేదీ : Mar 5, 2018 4:15 PM IST

అది.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా!!!

తండ్రి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో సినీ రంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నతనం లోనే అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అలానే హీరో గా తొలి చిత్రం రాజకుమారుడు తో సూపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయనకున్న అభిమాన గానం అంతా ఇంతా కాదు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఆయనకు వీరాభిమానులున్నారు.

అంతే కాదు స్టార్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేఇస్నా అతడు చిత్రం తో ఆయన తెలుగు చిత్రాల స్టామినా ను ఓవర్సీస్ మార్కెట్ కు చూపించారు. తదుపరి ఆయన నటించిన ప్రతి చిత్రం మంచి రెవిన్యూ తో అక్కడ దూసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా ఆయన నటించిన కొన్ని ప్లాప్ చిత్రాలు కూడా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు సాధించాయి కూడా. ప్రస్తుతం అసలు విషయం లోకి వెళితే అమెరికా వీసా కోసం మీరు ఇంటర్వ్యూకి వెళ్లగానే కౌంటర్‌ వద్ద ఉన్న అమెరికన్‌ అధికారి నమస్కారం, అమెరికాలో మీ బంధువులు ఉన్నారా, అక్కడికి వెళ్లి ఎంత కాలం ఉంటారు. అని తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది.

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఇదే తీరులో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వీసాకు భాష అడ్డంకి కాకూడదనేది అమెరికా ప్రభుత్వ సిద్ధాంతం. అందుకే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. అందుకే హైదరాబాద్‌ లోని అమెరికన్ కాన్సులేట్‌ అధికారులకు ప్రస్తుతం తెలుగు, హిందీలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇలా తెలుగు, హిందీ నేర్చుకున్న ఆరుగురు వీసా అధికారులు ఇక్కడి మీడియా ప్రతినిధులకు తమ అనుభవాలు వివరించారు.

సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే కాన్సులేట్‌ అధికారులు తొలిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా అమెరికన్ కాన్సులేట్ కు వచ్చేవారికి అర్ధమయ్యేలా మేము అన్ని భాషల్లో తర్ఫీదు తీసుకుంటున్నాం . వివిధ భాషల్లో వచ్చే పత్రికలు, యూట్యూబ్‌ వీడియోలు, సినిమాలు, నవలలు శిక్షణ పొందే వారి కోసం అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ప్రతి భాషకు ఒక్కో విభాగం ఉంటుంది. శిక్షణ పొందే వారు దాదాపు ఆరు నెలలు పాటు ఇక్కడ ఉండి భాష నేర్చుకోవాలి. ఆ తర్వాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారినే విదేశాంగ శాఖ అధికారులుగా ఎంపిక చేస్తారు అని అన్నారు.

వారిలో కెల్లి అనే అధికారిని మాట్లాడుతూ అమెరికాలో మాకు ఇచ్చిన శిక్షణ వల్ల భాష ఎలా ఉంటుంది, ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, అనే విషయాలు తెలిశాయి. మాకు చాలా తెలుగు సినిమాలు చూపించేవారు. అయితే అవన్నీ క్లాసిక్స్‌. సినిమా భాషకు, ఇక్కడ మాట్లాడే తెలుగుకు చాలా తేడా ఉంటుంది. అందుకే ఒక్కో సినిమాను నాలుగైదు సార్లు చూసేదాన్ని అన్నారు. అప్పుడు డైలాగ్‌లతో సహా అన్నీ అర్థమవుతాయి. నాకు శిక్షణలో ఉన్నప్పటి నుంచి నటుడు మహేశ్‌బాబు అంటే ఇష్టం. ఆయన అందం, నటన, ఆహార్యం, భాష విధానం అద్భుతం అని, అందుకే అతడి సినిమాలే చూపించమని అడిగేదాన్ని అని అలానే మరికొందరు కూడా అయన చిత్రాలు చూపించమని అడిగేవారని అన్నారు. ఇప్పుడు కౌంటర్‌లో నేను తెలుగు మాట్లాడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అని చెప్పారు….

Comments